బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన హేమ...!!

murali krishna
కమెడియన్ రోల్స్ లో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో నటించి హేమ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అలాగే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఒక కమెడియన్ సినిమాలో తనకు హేమ వద్దని చెప్పారని ఆ డైరెక్టర్ అదే విషయం నాకు చెప్పారని హేమ చెప్పుకొచ్చారట.

ఆ తర్వాత ఆ కమెడియన్ దగ్గరకు వెళ్లి తాను డైరెక్ట్ గా అడిగానని హేమ కామెంట్లు చేశారట.. అయితే ఆ కమెడియన్ మాత్రం తాను ఆ విధంగా అనలేదని చెప్పాడని హేమ పేర్కొన్నట్లు సమాచారం..

అయితే ఒక ఫ్రెండ్ తన గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసేదని హేమ తెలిపింది.. తాను మనుషులను అస్సలు కేర్ చెయ్యనని మీకు తనే అవసరం తనే కరెక్ట్ అని ఆమె అనేదని హేమ చెప్పారు.ఇలాంటి కామెంట్ల వల్ల కొన్నిసార్లు నష్టం జరుగుతుందని హేమ చెప్పుకొచ్చారు.అయితే తన గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుందని తనను నేను అడగలేదని హేమ చెప్పుకొచ్చారట.. అయితే ఆమె నమ్మిన వ్యక్తులే తర్వాత రోజుల్లో ఆమెను వెన్నుపోటు పొడిచారని హేమ వెల్లడించింది.

ఆమె తిరిగితిరిగి నా దగ్గరకే వచ్చిందని హేమ పేర్కొన్నారట.. నాదే తప్పు నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఆమె అన్నారని హేమ వెల్లడించారు. బాలకృష్ణ గారితో ఎక్కువగా సినిమాలు చేశానని హేమ తెలిపారట.బాలయ్య బాబు భోళా శంకరుడని ఆయన అంటే చాలా ఇష్టమని హేమ చెప్పుకొచ్చారు.. ఆయన భగవద్గీత చదివి ధైవభక్తిని ఎక్కువగా కలిగి ఉన్నారని హేమ తెలిపింది..

బాలయ్య బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఓటు హేమకు మరియు శ్రీకాంత్ కు వేస్తానని చెప్పారని హేమ చెప్పుకొచ్చారు. నేను కాల్ చేసి ఓటు కోసం కాంటాక్ట్ అయ్యానని ఆయనకు కల్లాకపటం ఉండదని హేమ కామెంట్లు చేశారట.. రవితేజ సో స్వీట్ అని ఆయన బాగా రిసీవ్ చేసుకుంటారని హేమ తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: