గ్లామర్ డోస్ పెంచేస్తున్న కీర్తి.. కారణం అదేనా?

praveen
కీర్తి సురేష్.. ఈ పేరు చెప్పగానే సినీ ప్రేక్షకులు అందరికి గుర్తొచ్చేది మహానటి సినిమా. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో నేటి తరం సినీ ప్రేక్షకులు కీర్తి సురేష్ సావిత్రి అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది కీర్తి సురేష్. కానీ ఆ తర్వాత మాత్రం ఈ క్రేజ్ ని ఉపయోగించుకొని సరైన అడుగులు వేయలేకపోయింది. దీంతో గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతమవుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసిన కీర్తి సురేష్ ఇప్పటి వరకు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలు  చేయలేదు.

 అలాంటి పాత్రలకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తోంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అందాల ఆరబోత చేయకపోతే ఇక కెరీర్ నాశనం అవుతుంది అనుకుందో ఏమో ఇప్పుడు ఒక్కో సినిమాకి గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులందరికీ షాక్ ఇస్తుంది కీర్తి సురేష్. వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడిపోయింది కీర్తి సురేష్  ఇక గ్లామర్ డోస్ తో స్పీడ్ అందుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వరుస ఫ్లాపులు ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయ్. అయితే అవకాశాలు వస్తున్నా హిట్లు మాత్రం దక్కడం లేదు.


 తమిళ తెలుగు కన్నడ ఇండస్ట్రీ లో కూడా ఈ అమ్మడు ఫ్లాప్ హీరోయిన్ అనే కొనసాగుతోంది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. కానీ సినిమాలు మాత్రం హిట్ అవ్వడం లేదు. ఇటీవలే నితిన్ సరసన నటించిన రంగ్ దే సినిమాతో ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. తర్వాత సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన అన్నాత్తయ్ సినిమాలో రజనీ చెల్లెలిగా నటించి న కలిసి రాలేదు. అయితే ఇప్పటికే రష్మిక మందన్న పూజా హెగ్డే లాంటి వాళ్ళు  గ్లామర్తో ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా గ్లామర్ డోస్ పెంచాలి నిర్ణయించుకున్నట్లు ఉంది ఈ ముద్దుగుమ్మ. సర్కారి వారి పాట సినిమాలో కాస్త అందాల ఆరబోత చేసే అవకాశముందని అనుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా గ్లామర్ పాత్రలు చేసేందుకు కీర్తి సురేష్ రెడీ అయిపోయింది అన్నా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: