బాలీవుడ్ లో అసలు ఎన్నడూ లేనంతగా ప్రమోషన్స్ కోసం దీపిక పదుకొనే ఫీట్లు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. తన కోస్టార్ సిద్ధార్థ్ చతుర్వేదితో ఘాటైన లిప్ లాక్ లు వేసిన విజువల్స్ తోనే బోలెడంత ప్రచారం కొట్టేసింది గెహ్రాయాన్ సినిమా.అయితే దీనికి కౌంటర్ గా కొద్ది సేపటి క్రితం రణవీర్ దీపికతో డీప్ లిప్ లాక్ చేస్తున్న ఓ ఫోటోగ్రాఫ్ విడుదలవ్వడం జరిగింది. ఇది ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతూ సునామీ సృష్టిస్తోంది.నిజానికి ఈ ఫోటోగ్రాఫ్ వెబ్ లోకి రాక ముందు దీపిక గెహ్రయాన్ కోస్టార్ సిద్ధార్థ్ చతుర్వేదితో డీప్ లిప్ లాక్ లాగించేస్తున్న ఓ వీడియో అంతకుమించి తెగ వైరల్ అయ్యింది. ఇందులో అతడిని దీపిక తెగ ఆటాడుకుంటోంది. ఘాడమైన మైకంతో ప్రేమ భావనలతో చలించిపోయే యువతిగా దీపిక యూత్ మతులు చెడగొట్టింది ఈ సీన్ లో. ఇక ఈ వీడియోతో పాటు ఆసక్తికర కొటేషన్ ని కూడా ఇచ్చింది టీమ్.భయం- గందరగోళం ఇంకా చీకటి మధ్య ప్రకాశించే హృదయం టియా(దీపిక)కు ఉంది.
ఈ సినిమా నా జీవితంలో చాలా అందమైన అనుభవాలలో ఒకటి.ఇక టియా పాత్ర పెరగడం ప్రారంభించిన విధానంతో నేను ఎలా కనెక్టయ్యాను? అనేది ఆసక్తికరం. ముఖ్యంగా ఈ పాత్ర నా కోసం అందించిన పాఠాలు చాలా ఉన్నాయి. వేచి ఉండటం అనేది చాలా చాలా కష్టం.. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా విలువైనదే అవుతుంది.ఇక ఇప్పుడు #GehraiyaanOnPrime చూడండి అంటూ లవ్ ఈమోజీని దీపిక షేర్ చేయడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో నేడు గెహ్రయాన్ సినిమా ప్రీమియర్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు కూడా వచ్చేశాయి.ఇందులో దీపిక నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. అనన్యను ప్రేమించే సిద్ధార్థ్ తో కన్నింగ్ బ్యూటీ దీపిక చేసే రొమాన్స్ నేపథ్యంలో నేటితరం సంక్లిష్ట సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం యూత్ ని ఎంతగానో కట్టిపడేసే ఎలిమెంట్స్ కి కొదవేమీ లేదని సమాచారం తెలుస్తుంది.