పుష్ప' ఓటీటీలో కూడా భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో
బన్నీ పెర్ఫార్మన్స్ కు అయితే అందరూ
ఫిదా అయిపోయారు. సినిమాలో కొన్ని సాంగ్స్ ను మరియు డైలాగ్స్ ను అనుకరిస్తూ.. లక్షల రీల్స్ అండ్ మీమ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాతో
బన్నీ పాన్
ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారట.
'పుష్ప'కి ఉన్న క్రేజ్ ని అందరూ తెగ వాడేసుకుంటున్నారు. ఇప్పటికే
సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్లు కూడా వచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఏకంగా చీరలను కూడా డిజైన్ చేస్తున్నారు. రకరకాల వస్తువులను తయారు చేయడంలో
సూరత్ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అక్కడ చరణ్ జీత్ క్లాత్
మార్కెట్ లో ప్రస్తుతం 'పుష్ప'
సినిమా పోస్టర్లతో డిజైన్ చేసిన చీరలను అమ్ముతున్నారట. 'పుష్ప'
సినిమా పాపులర్ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలనే ఆలోచన చరణ్ పాల్ అనే వ్యాపారికి వచ్చిందట.
దీంతో వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టి కొన్ని చీరలను కూడా తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్ లు వస్తున్నాయంట. దీని గురించి చరణ్ పాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన 'పుష్ప' చీరల కోసం భారీ ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు.
'పుష్ప'
సినిమా విడుదలైన రెండు నెలలు గడుస్తున్నా కానీ క్రేజ్ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా
రష్మిక నటించిన విషయం తెలిసిందే. అలానే సునీల్, అనసూయ,
అజయ్ ఘోష్ లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కూడా కనిపించారు. మైత్రి
మూవీ మేకర్స్, ముత్తంశెట్టి
మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ
సినిమా పార్ట్ 2 రాబోతుందట. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నారు.