హీరో గోపీచంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మొదట హీరోగా కెరియర్ మొదలు పెట్టిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ పాత్రలో నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ లో విలన్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్ తిరిగి మళ్లీ హీరోగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకొన్నాడు, ఇలా హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత నుండి హీరోగానే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. అందులో భాగంగా గోపీచంద్ నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయలను సాధించడంతో గోపీచంద్ తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోగా మారిపోయాడు, ఇది ఇలా ఉంటే ఇప్పటికే పోయిన సంవత్సరం మహిళ కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సీటి మార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే గోపీచంద్, శ్రీవాసు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది. ఇప్పటికే గోపీచంద్, శ్రీనివాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం రెండు సినిమాలు తెరకెక్కాయి, ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించాయి, ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ఖిలాడి మూవీలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతి ని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.