హాట్ టాపిక్ గా ఆ హీరో రెమ్యునరేషన్..!
'బడేమియా చోటే మియా' సినిమాని డైరెక్ట్ చేస్తోన్న అలీ అబ్బాస్ జాఫర్ 25కోట్లు తీసుకుంటున్నాడు. ఇక మిగతా స్టార్ క్యాస్టింగ్, ప్రొడక్షన్‌కి కలిపి 100కోట్లు ఖర్చు చేస్తున్నారట. మొత్తంగా ఈ సినిమాకి 225 కోట్లు వరకు అవుతుందని చెప్తున్నారు. సో ఈ లెక్కలతో చూస్తే బాలీవుడ్‌లో 'బడే మియా చోటే మియా' హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ గురించి బయటకు రాగానే, బాలీవుడ్‌లో మిగతా స్టార్ల రెమ్యూనరేషన్ ఎంత అనే చర్చ మొదలైంది. అక్షయ్ కంటే టాప్‌లో ఉన్న ఖాన్స్ ఎంత తీసుకుంటున్నారు, భారీ ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న హృతిక్ ఎంత చార్జ్ చేస్తున్నాడనే ప్రశ్నలు మొదలయ్యాయి.
హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేస్తోన్న సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంది. ఈ హీరో 100 కోట్లు శాలరీతో పాటు శాటిలైట్ రైట్స్ కూడా తీసుకుంటున్నాడు. ఈ రైట్స్‌లో మరో 50 కోట్లకిపైగానే ప్రాఫిట్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఆమిర్ ఖాన్ సినిమాకి 35 కోట్లు పుచ్చుకుంటున్నాడట. అలాగే సినిమా లాభాల్లో వాటా తీసుకుంటాడని తెలుస్తోంది. ఈ రెండు కలిపి ఆమిర్‌కి 150 కోట్ల వరకు వస్తుందట. షారుఖ్ ఖాన్ కొన్నాళ్లుగా సినిమాలకి దూరమయ్యాడు గానీ, రెమ్యూనరేషన్ మాత్రం తగ్గించలేదు. ఈ బాలీవుడ్ బాద్‌షా సినిమా బిజినెస్‌లో సగానికిపైగా తీసుకుంటున్నాడని చెప్తున్నారు. అలాగే అజయ్ దేవగణ్ 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడట. ఇక హృతిక్ రోషన్ అయితే 110 కోట్ల వరకు అందుకుంటున్నాడట.