తెలుగు అమ్మాయి రీతూ వర్మ 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది, ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమా అయిన కన్నుమ్ కన్నుమ్ కొల్లఇయదితాల్ సినిమాలు హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా మంచి విజయం సాధించింది, ఈ సినిమానే తెలుగులో కనులు కనులను దోచాయంటే అనే పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించి రీతూ వర్మ కు మంచి గుర్తింపు ను తీసుకువచ్చింది, ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా టక్ జగదీష్ సినిమాలో నటించింది, ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల అయింది, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత రీతు వర్మ, నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన వరుడు కావలెను సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా కూడా రీతు వర్మ కు నిరాశనే మిగిల్చింది, ఇలా వరుసగా రెండు పరాజయాలను అందుకున్న రీతూ వర్మ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో అమల అక్కినేని ఒక కీలక పాత్రలో నటిస్తుంది, అలాగే నాసర్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు, ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఎస్ ఆర్ నిర్మిస్తున్నాడు, ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఒకే ఒక జీవితం సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను అలాగే టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది, ఒకే ఒక జీవితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్, టీజర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది, ఇలా ఇప్పటికే రెండు వరుస పరాజయాలను ఎదుర్కొన్న రీతూ వర్మ 'ఒకే ఒక జీవితం' సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.