షాక్: అల్లు అర్జున్ పై బాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్..!!
మీడియాతో మిథున్ చక్రవర్తి మాట్లాడితూ ప్రస్తుతం.. సినీ పరిశ్రమ చాలా మారిపోయిందని తెలియజేశాడు. ఇక వాటితో పాటు అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఇక పుష్ప మూవీ తనకు బాగా నచ్చిందని చక్రవర్తి తెలియజేశారు. బాలీవుడ్ లో కూడా 100 కోట్లకు పైగా సొంతం చేసుకున్న ఈ మూవీని బాలీవుడ్ లో ఉండే స్టార్స్ కొంతమంది ప్రముఖులు కూడా చూడడం జరిగిందని తెలియజేశారు.
వారంతా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియ చేస్తే నేను మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తున్నానని తెలిపారు. తనకు ఇష్టమైన నటులలో అల్లు అర్జున్ కూడా ఒకరు ఈ సినిమాతో చేరిపోయారని తెలిపారు. పుష్ప సినిమా కూడా తనకు బాగా నచ్చిందని.. అల్లు అర్జున్ తన నటన ఎంతో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తనకు 1980,90 సంవత్సరాల నటించిన సినిమాలు గుర్తుకు వస్తున్నాయ్ అని తెలిపాడు మిథున్. సినిమాకు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమా ఇంతటి విజయం సాధించిందని తెలిపారు. ఇక వంద కోట్ల కలెక్షన్ చేసే దక్షిణాది మూవీ లో పుష్ప సినిమా ఐదో స్థానంలో ఉందని తెలిపాడు.