పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ ను పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు, ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఒకేసారి ప్రారంభించినప్పటికీ ఆ సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను దాదాపుగా పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు, కారోనా కారణంగా భీమ్లా నాయక్ సినిమా విడుదల చేయడానికి చిత్ర బృందం రెండు విడుదల తేదీలను ఖరారు చేసింది, అందులో ఫిబ్రవరి 25 వ తేదీన లేక ఏప్రిల్ 1 వ తేదీన గాని భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటించడంతో ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు లీక్ ల సమస్య కూడా వెంటాడుతూనే ఉంది, ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా సమయంలో కూడా ఇలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నాడు, తాజాగా భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కు ఇలాంటి సమస్య ఎదురయింది, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా నుండి తాజాగా ఒక పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది, ఇది కేవలం పోస్టర్ కాబట్టి అభిమానులు పెద్దగా కంగారు పడటం లేదు. కాకపోతే సినిమాలోని పాటలు, డాన్స్ బిట్స్, ఇతర సన్నివేశాలు లీక్ కాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు, ఇలా భీమ్లా నాయక్ సినిమాకు కూడా లీక్ ల బెడద తప్పడం లేదు.