ఆ కారణంగా నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పాడు... మృణాళిని ఠాకూర్..!

Pulgam Srinivas
మృణాళిని ఠాకూర్ అనేక సీరియల్ లలో నటించే మంచి పాపులారిటీని సంపాదించుకుంది, అలా సీరియల్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 30 అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. 30 సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు కు మంచి సినిమా అవకాశాలు దక్కాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మృణాలిని ఠాగూర్,  షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ 'జెర్సీ' సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది, ఈ సినిమా నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం సాధించిన జెర్సీ సినిమా రీమేక్ గా తెరకెక్కుతోంది.


 జెర్సీ హిందీ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది,  ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాళిని ఠాకూర్ అనేక విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో మృణాళిని ఠాకూర్ మాట్లాడుతూ... తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అని తెలియజేసింది,  అలాగే తనకు ఏడు నెలల క్రితం బ్రేకప్ జరిగింది అని, తాను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడని మృణాళిని ఠాగూర్ చెప్పుకొచ్చింది. కట్టుబాట్లు,  పద్ధతులు చాలా ఎక్కువగా ఫాలో అవుతాడు అని తామిద్దరం ఒకరి నొకరు ఇష్టపడ్డాము అని నేను మూవీ లలో నటిస్తాను అని తెలిశాక నన్ను వదిలిపెట్టి పోయాడు అని మృణాళిని ఠాకూర్ తెలియజేసింది,  తను విడిచి పెట్టి పోయినందుకు కూడా అతనిపై ఎలాంటి కోపం కూడా లేదు అని మృణాళిని ఠాగూర్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు సర్దిచెప్పుకుని పెళ్లి  తరవాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తప్పేవాని మృణాళిని ఠాకూర్ చెప్పుకొచ్చింది.  తమకు పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత.. వారిని పెంచే క్రమంలో కూడా  గొడవలు రావొచ్చని.. అందుకే తన బ్రేకప్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు అని మృణాళిని ఠాకూర్ తెలిపింది,  అలాగే కెరియర్ లో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లుగా మృణాళిని ఠాకూర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: