టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోల సంఖ్య ఎక్కువే. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలు అయినా సాధారణ ప్రజలు అయినా నేటి తరంలో అరేంజ్డ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ లే ఎక్కువగా చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రేమ వివాహాలు చేసుకున్న మన తెలుగు హీరోల నంబర్ కూడా ఎక్కువే. ఎంతో స్ట్రాంగ్ గా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒకటి అయిన వారికి 'వాలెంటెన్స్ డే' ఖచ్చితంగా స్పేషలే కదా. మరి ప్రేమికుల రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే హీరోలు ఎవరో వారి జంటలు ఎవరు అన్నది ఒకసారి తెలుసుకుందాం పదండి.
* టాలీవుడ్ లో ప్రస్తుతం స్వీట్ లవ్ బర్డ్స్ అంటే ముందుగా వినిపించే జంట మహేష్ బాబు, నమ్రత లదే. నమ్రత శిరోద్కర్ హీరోయిన్ అయినప్పటికీ మహితో పెళ్ళి తర్వాత అన్నిటికీ గుడ్ బై చెప్పేసి తన వైవాహిక జీవితాన్ని అందులో తన పిల్లల బాగోగులు చూసుకుంటూ చాలా బిజీ అయిపోయారు. వీరు ఎంత బిజీగా ఉన్నా వారి తియ్యని ప్రేమకి గుర్తుగా వాలెంటెన్స్ డే ని చాలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారట. భార్య నమ్రత కోసం నైట్ డిన్నర్ కి కూడా మహి ఏర్పాటు చేస్తారట.
* మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఆయన భార్య ఉపాసన వీరిది కూడా ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. వీరైతే వాలెంటైన్స్ డే కి ఔట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్ళడం అలవాటు అని వారి సన్నిహితులు అంటుంటారు.
* దగ్గుబాటి రానా అతని భార్య మిహికది కూడా ప్రేమ వివాహమే. కొన్నేళ్ల వీరి లవ్ జర్నీకి తియ్యటి ఎండ్ కార్డ్ వేసి రీసెంట్ గా వీరు పెళ్లి చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే. రానా కూడా ఈసారి భార్య మిహికకు పెద్ద బహుమతినే ఇచ్చినట్లు తెలుస్తోంది.
* యంగ్ హీరో నితిన్ ది కూడా లవ్ మ్యారేజ్. ఈ కపుల్ కూడా వాలెంటెన్స్ డేని చాలా చాలా స్పెషల్ గా జరుపుకుంటారట.