ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ గ్లింప్స్ వైరల్..!!
కొద్ది నిమిషాల క్రితమే రాధే శ్యామ్ మూవీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది చిత్రబృందం. ఇక ఈ రోజున ప్రేమికుల దినోత్సవ సందర్భంగా గ్లింప్స్ విడుదల కావడంతో బాగా వైరల్ గా మారుతోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగింది. ఇక యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రశీద , ప్రమోద్ నిర్మించారు. ఇక ఈ సినిమా సినిమా ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 11వ తేదీన విడుదల కానుంది.
ఇక ఈ సినిమా గ్లింప్స్ విషయానికొస్తే.. పూజా హెగ్డే వాయిస్ డైలాగుతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రిచ్ నేస్ కలిగి ఉంది. ఇక ప్రభాస్ పూజ హెగ్డే ఇందులో ఒక ఒక విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక అంతేకాకుండా ప్రభాస్ ఎవరికో ప్రపోజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చివరిగా పూజా హెగ్డే నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు అనే డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. ఈ వాలెంటైన్స్ డేట్ కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రభాస్ అభిమానులకు లభించిందని చెప్పవచ్చు.