బాలయ్య వైరల్ కామెంట్.. సినిమాల విషయంలో వారి కాళ్ల దగ్గరికి వెళ్లేదెలే..!

N.ANJI
బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రజ్ఞ్య జైస్వాల్ నటించగా, పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. అంతేకాదు.. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. చాలా రోజుల నుండి సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నా బాలయ్యకి ఈ సినిమా విందు పెట్టిందనే చెప్పాలి. అంతేకాదు.. బాలయ్య సినీ కెరీర్ లోనే భారీ హిట్ గా అఖండ సినిమా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మూవీ విడుదలకి ముందు టికెట్ ధరల సమస్య ఉన్నప్పటికీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదల అప్పుడు ముందు రేట్స్ గాని ఉండి ఉంటే మరిన్ని భారీ రికార్డ్స్ ఈ చిత్రం అందుకొని ఇండస్ట్రీలో టాక్. కాగా.. ఈ మూవీ సక్సెస్ అనంతరమే ఏపీలో నెలకొన్న టికెట్ ధరల సంక్షోభంపై బాలయ్య స్పందించారు. అయితే తాజాగా బాలయ్య చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
ఇంతకీ బాలయ్య చేసిన కామెంట్స్ ఏంటంటే.. నేను రాజకీయం పరంగా తన నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడి వరకు అయినా వెళ్తానని కానీ నా సినిమాల విషయంలో మాత్రం ఎవరి కాళ్ళ దగ్గరకి వెళ్లే ప్రసక్తి లేదు" అని ఒక మాస్ స్టేట్మెంట్ ని బాలయ్య అందించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ వినపడుతుంది. దీంతో బాలయ్య అభిమానులు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నా మరి ఇదే బాలయ్య తన సినిమా "గౌతమి పుత్ర శాతకర్ణి" కోసం తెలంగాణా సీఎం దగ్గరకి వెళ్లి మాట్లాడలేదా? ఇప్పుడు ఎందుకు ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం అంటూ అప్పటి పిక్స్ పెట్టి కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో బాలయ్య మాస్ స్టేట్మెంట్ ఇలా బోల్తా కొట్టినట్టు అయ్యిందనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: