నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

N.ANJI
సాధారణంగా ఇండస్ట్రీలో చాలా మంది నటులు చెప్పే విషయం ఏంటంటే.. అవకాశాలు ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవాలని చెబుతుంటారు. అలా వెసుకోకుండా ఉంటే అవకాశాలు రాక.. ఇండస్ట్రీకి దూరమైనప్పుడు ఏ పని చేయాలో తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ తినడానికి తిండి కూడా లేనంతగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలోనే ఓ ప్రముఖ హీరోయిన్ అవకాశాలు లేక తినడానికి తిండి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేయడం స్టార్ట్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో ఒక్కసారి చూద్దామా.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమా హీరోయిన్ దేవయాని అందరికి సుపరిచితురాలు. ఈ చిత్రంలో ఆమె ఎంతో సింపుల్‌గా నటించింది. ఈ చిత్రం తరువాత ఆమె తెలుగు సినిమాలలో చాలా తక్కువగా నటించారు. అయితే 1993లో బెంగాలీ సినిమాతో మొదలైన తన సినీ ప్రయాణం.. ఆ తర్వాత తమిళ్‌లో బాగా బిజీ రాణిస్తున్నారు. ఇక అడపాదడపా తెలుగు, మలయాళం, బెంగాలీ భాషల సినిమాలలో నటిస్తూ మంచి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు.. ఆమె దక్షిణాది ఇండస్ట్రీలో మొత్తం 90 సినిమాలలో నటించారు.
అంతేకాదు.. దేవయాని బుల్లితెరపై ఏడు సీరియల్స్‌లో నటించారు. అయితే దేవయాని అసలు పేరు సుష్మ. ఆమె సినీ జీవితం మొత్తం ట్రెడిషనల్ గానే కనిపించి ఎంతోమంది కళల దేవతగా రాణించింది. కాగా.. హీరోయిన్‌గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకోవడం.. పిల్లల్ని కనడం.. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడంతో ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. దాంతో ఆమె ప్రొడ్యూసర్‌గా మారి కొన్ని సినిమాలను నిర్మించారు. కానీ ఆ సినిమాలు సరైన విజయాలను అందుకోకపోవడంతో ఆస్తినంతా పోగొట్టుకుని ఆర్థికంగా నష్టపోయింది. ఇక తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆమె టీచర్‌గా కూడా పని చేశారు. ఆ తరువాత తల్లి పాత్రలతో తన సెకండ్ ఇన్సింగ్‌లో రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: