టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.అయితే ఇదిలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం 'ప్రాజెక్ట్ కే' లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగానే ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చారు అమితాబ్ బచ్చన్.అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రామోజీ ఫిలిం సిటీ లో అమితాబ్ బచ్చన్ ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత వారిద్దరి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం వినిపిస్తోంది.
అయితే వీరిద్దరూ ఉన్నట్టుండి ఎందుకు సమావేశం అయ్యారు? దాని వెనుక ఉన్న కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో అమితాబ్ బచ్చన్ ని ఎన్నో సార్లు కలిసి ముచ్చటించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత సడన్గా ఇలా రామోజీ ఫిలిం సిటీ లో ఇద్దరు కలుసుకోవడంతో సినీ ప్రముఖులంతా ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇక ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్ల సినిమా సరికొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు దర్శకుడు క్రిష్...!!