విజయ్ న్యూ రికార్డ్.. కానీ మహేషే నెంబర్ 1 ?
ఇక ఈ పాట విడుదలైన తర్వాతి రోజు విజయ్ పాట విడుదల అయ్యింది.తలపతి విజయ్ ఇంకా పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో 'అరబిక్ కుతు...' సాంగ్ ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. ఇక ఈ పాటకు 24 గంటల్లో 18 మిలియన్ వ్యూస్ ఇంకా 2 మిలియన్ లైక్స్ వచ్చాయి. మహేష్ సాంగ్ రికార్డు క్రియేట్ చేసిన తర్వాతి రోజే ఆ రికార్డుని ఈ పాట బ్రేక్ చేసింది.కానీ ఒక్క విషయంలో మాత్రం విజయ్ మహేష్ కంటే వెనకబడిపోయాడు. ఏంటంటే.. కళావతి పాట అనుకున్న రిలీజ్ డేట్ కి రెండు రోజులు ముందుగానే యూ ట్యూబ్ లో లీకైపోయింది. ఇక చిత్ర బృందం చాలా బాధతో నెక్స్ట్ డే పాటను రిలీజ్ చేసింది. పాట లీకైనా కానీ ఇది రిలీజ్ చేసిన 24 గంటలు దాకా అంతకుముందు వున్న ఒక్కో రికార్డును బద్ధలు కొట్టుకుంటూ ట్రెండింగ్ లో దూసుకుపోతూ నెంబర్ వన్ పొజిషన్లో వుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికి కూడా యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 పొజిషన్లోనే వుంది. సో ఈ విషయంలో విజయ్ మహేష్ ని దాటలేకపోయాడు. విజయ్ పాట ఇంకా నెంబర్ 3 పొజిషన్లోనే ట్రెండ్ అవుతుంది.