టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరనే విషయం అందరికి తెలిసిందే. గతంతో పోలిస్తే తెలుగులో ప్రకాష్ రాజ్ కు మాత్రం సినిమా ఆఫర్లు బాగా తగ్గాయి. అయితే వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.
టాలీవుడ్ లో రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ప్రకాష్ రాజ్ ఒకరనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట..
సినిమా ఇండస్ట్రీలో పోటీ సాధారణం అని కొందరు ఆ పోటీని పాజిటివ్ గా తీసుకుంటారని మరి కొందరు అయితే తీసుకోరని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో ఈర్ష్యలు కూడా చూశానని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారట.. ఈర్ష్యను నేను పర్సనల్ గా తీసుకోనని ఆయన తెలిపారట. నేను ఇండస్ట్రీలోకి వచ్చేసరికి హిస్టారికల్ సినిమాలు ఆగిపోయాయని ప్రకాష్ రాజ్ వెల్లడించారట.. రాజమౌళి సినిమాలకు తాను ఎక్కువగా అవసరం పడలేదని ఆయన పేర్కొన్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం సెల్ ఫోన్ లో కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారని సమాచారం.. హీరోగా సినిమా ఆఫర్లు వచ్చినా ఆ సినిమాలలోని హీరో రోల్ ను కూడా తాను పాత్రగా చూస్తానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు తారక్ మరియు రామ్ చరణ్, మహేష్ డ్యాన్స్ చేస్తారని యాక్షన్ హీరోలే బాగా చేస్తారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారట.ముఖ్య కథా పాత్రలలో నటించడానికి తాను ఆసక్తి చూపిస్తానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
తాను ముక్కుసూటిగా ఉండటం వల్ల కొన్నిసార్లు బ్యాన్ చేశారని అయితే సమస్యలను పరిష్కరించుకున్నానని ప్రకాష్ రాజ్ అన్నారట. ప్రతి మనిషికి బలం వల్ల బలహీనతల వల్ల గుర్తింపు ఉండాలని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మా ఎన్నికల తరువాత ప్రకాష్ రాజ్ పెద్దగా తెలుగు ఇండస్ట్రీ లో కనిపించడం l.