ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

NAGARJUNA NAKKA
యంగర్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాల గురించి ఎన్ని చర్చలు జరుగుతాయో.. పెళ్లి గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుతుంటారు సినీ జనాలు. అయితే ఇప్పుడు జనాలు మాత్రమే కాదు సెలబ్రిటీస్‌ కూడా ప్రభాస్‌ పెళ్లి గురించి ఆరాలు తీస్తున్నారు. రాధేశ్యామ్ కో-స్టార్ పూజా హెగ్డే కూడా ప్రభాస్‌ని పెళ్లి ఎందుకు చేసుకోట్లేదని అడిగింది. ఇంతకీ ప్రభాస్‌ బ్యాచిలర్‌గానే ఉండిపోవడానికి కారణమేంటనే దానిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ప్రభాస్ పెళ్లి గురించి పదేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్‌.ఆర్.ఐ.ని పెళ్లి చేసుకుంటాడని ఒకసారి, రెబల్ స్టార్ కృష్ణం రాజు పెళ్లి సంబంధం కుదిర్చాడనీ.. డార్లింగ్‌ పెళ్లి పీటలెక్కడం ఖచ్చితం అయిపోయిందని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్‌ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. 42 ఏళ్ల వయసులోనూ సోలో బ్రతుకే సో బెటర్‌ అనే ఆలోచనలో ఉండిపోయాడు. దీంతో చాలామంది ప్రభాస్‌ని సల్మాన్‌ ఖాన్‌తో పోల్చుతున్నారు.

ప్రభాస్‌ 'బాహుబలి' సమయంలో మాహిష్మతి సామ్రాజ్యం నుంచి బయటకురాగానే సోలో లైఫ్‌కి కూడా ఎండ్‌ కార్డ్ వేస్తానని చెప్పాడు. కానీ ఈ సినిమా పూర్తై కూడా అయిదేళ్లు దాటుతోంది. అయినా ప్రభాస్‌ ఇంకా బ్యాచిలర్ లైఫ్‌ నుంచి బయటకిరాలేదు. దీంతో ప్రభాస్‌ కూడా సల్మాన్‌ ఖాన్‌లా సింగిల్‌గా ఉండిపోతాడేమో, పెళ్లి చేసుకోడేమో అని మాట్లాడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌ కూడా క్రియేట్‌ చేస్తున్నారు.

ప్రభాస్ చాలాకాలం తర్వాత నటించిన కంప్లీట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ఈ సినిమా మార్చి 11న విడుదలువుతోంది. ఇక వాలెంటైన్స్‌ డే సందర్భంగా 'రాధేశ్యామ్' నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌లో పూజాహెగ్డే కూడా ప్రభాస్‌ పెళ్లి గురించి మాట్లాడింది.

'రాధేశ్యామ్‌' వాలెంటైన్స్‌ డే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్రభాస్ 'ఎఫ్-2' సినిమా ఎక్కువ సార్లు చూసి ఉంటాడు.. అందుకే పెళ్లి అంటే భయపడుతున్నాడని సల్మాన్ ఖాన్‌లా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడని మరికొంతమంది ఇలా బోల్డన్ని కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రభాస్‌ ఇంకా సింగిల్‌గానే ఉండిపోవడానికి కారణమేంటి అనేది మాత్రం పిల్మ్‌ సర్కిల్స్‌లో బిగ్గెస్ట్‌ క్వశ్చన్‌గానే మిగులుతోంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: