చిరంజీవిని జగన్ అవమానించారా.. ఆ ప్రచారం పై క్లారిటీ ఇచ్చిన అలీ..!

Anilkumar
ఏపీ సీఎం వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ ప్రచారం ఏంటంటే చిరంజీవి చేతులు ఎత్తి జగన్ కు నమస్కరిస్తూ ఏపీలో టికెట్ రేట్ల గురించి అభ్యర్థన చేయడం ఇక అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడం తో ఈ విధంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నటుడు అలీ.అయితే జగన్ కు టాలీవుడ్ సినీ ప్రముఖులను, మెగాస్టార్ చిరంజీవిని అవమానించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.ఇక అలీ ఈ విషయమై ఏపీ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ల ధరలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండాలని భావిస్తోందని పేర్కొన్నారు.


 అంతేకాకుండా అలీ  సీఎం జగన్ టాలీవుడ్ పెద్దలు కలిసిన సమయంలో ఇండస్ట్రీకి మేలు జరిగేలా చూస్తామని మాట ఇచ్చారని అలీ చెప్పుకొచ్చారు.  అంతేకాదు దీంతోపాటు అలీ సీఎం జగన్ తనకో శుభవార్త ఉందని చెప్పారని అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచి శుభవార్తకు సంబంధించిన ప్రకటన వస్తుందని అన్నారని చెప్పుకొచ్చాడు.ఇక ఆ శుభవార్త ఏమిటో తనకు తెలియదని అలీ చెప్పుకొచ్చారు. దీంతోపాటు రాజ్యసభకు ఛాన్స్ గురించి సీఎం జగన్ నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని  చెప్పుకొచ్చాడు.అయితే చిన్న సినిమాలకు కూడా లాభం ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్దేశమని అలీ కామెంట్లు చేశారు.  


దీంతోపాటు తనకు పదవుల విషయంలో అసంతృప్తి ఎప్పుడూ లేదని అలీ అన్నారు.  అంతేకాకుండా సినీ పరిశ్రమకు కావాలని ఇబ్బందులు ఎవరూ సృష్టించలేదని చెప్పుకొచ్చారు. అయితే అలీ తెలంగాణ రాజకీయాల గురించి నాకు తెలియదని 1999 నుంచి తను రాజకీయాల్లో ఉన్నానని  పేర్కొన్నారు.  అంతేకాకుండా తాను రాజకీయాల్లోకి వచ్చి 23 సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అలీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అలీ ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: