కీర్తి సురేష్ 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఆ తర్వాత మహానటి సినిమాతో కీర్తి సురేష్ నటిగా గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత కూడా కమర్షియల్ సినిమాల కంటే కూడా ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తోంది, అందులో భాగంగా కీర్తి సురేష్ ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది, ఈ రెండు సినిమాలు కూడా ఓటిటి లోనే విడుదలయ్యాయి, ఓటిటి లో విడుదలైన ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా కూడా కీర్తి సురేష్ నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది, ఇలా మహానటి లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆరెంజ్ విజయాలను అందుకోలేక పోతుంది, అయితే అలాంటి సందర్భంలోనే ప్రస్తుతం కీర్తి సురేష్ 'సాని కాయిధం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది, తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'సాని కాయిధం' సినిమా ఓటిటి లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సెల్వ రాఘవన్ కు సోదరి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది, మరి ఈ సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.