బికినీతో సెగ పుట్టిస్తున్న వర్షిణి...!!

murali krishna
కొంతమంది నటీనటులకు అందం మరియు అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ వారి ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో గుర్తింపుకు నోచుకోలేకపోయిన నటీనటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాత్రం చాలా మందే ఉన్నారు.

కాగా ఆ మధ్య తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ ఆయన ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఢీ అల్టిమేట్ డాన్స్ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ వర్షిణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం జేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలో కూడా నటించింది. ఈ క్రమంలో 2010వ సంవత్సరంలో తమిళ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన శంభో శివ శంభో చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టినట్లు సమాచారం.. కానీ ఈ అమ్మడు నటించిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ కూడా గుర్తించలేదు. దాంతో తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని యాంకరింగ్ రంగం వైపు అడుగులు వేసిందట.దీంతో ప్రస్తుతం యాంకర్ వర్షిణి కి సినీ ఇండస్ట్రీలో పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రాకపోవడంతో కొంతమేర నిరాశ చెందుతోందట.

దాంతో సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోందట . ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందాలు ఆరబోస్తుందట ఈ హాట్ భామ. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ రోజురోజుకి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. కాగా ఆ మధ్య యాంకర్ వర్షిణి బీచ్ లో బికిని దుస్తులు ధరించి ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. అలాగే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇటీవలే కొందరు ఆకతాయిలు యాంకర్ వర్షిణి అప్పట్లో దిగిన బికినీ ఫోటోలను ప్రస్తుతం బాగా వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా యాంకర్ వర్షిణి కి హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయని కాబట్టి కనీసం ఇప్పటికైనా తెలుగు దర్శక నిర్మాతలు యాంకర్ వర్షిణి ప్రతిభను గుర్తించి సినిమా అవకాశాలు ఇవ్వాలని తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ వర్షిని తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న "శాకుంతలం" చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోందట . అలాగే ఇటీవలే ఈ అమ్మడికి ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిన్న బడ్జెట్ చిత్రంలో రెండో హీరోయిన్ గా అవకాశం వరించినట్లు పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు యాంకర్ వర్షిణి మాత్రం తనకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చిన విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: