అషూరెడ్డి.. ఈ పేరు యూత్ కు బాగా కనెక్ట్ అయింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు టెలివిజన్ లో కూడా తన సత్తాను ఛాటాలని తెగ ఉత్సాహపడి ప్రయోగాలు చెస్తుంది. ఎప్పుడూ ఆమె కనిపించిన బోల్డ్ గా కనిపించడంతో అమ్మడు యూత్ ఫాలొయింగ్ బాగా పెరిగి పోయింది. ఈ అమ్మడు కూడా ఆర్జీవి పొగిడిన యాంకర్లలో ఒకరు. బిగ్ బాస్ లో కూడా పాల్గొని తనదైన ముద్రను వేసుకుంది. బయటకు వచ్చాకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కొద్ది రోజులు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు బయట తీసుకున్న ఫోటో లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,కామెంట్లు అందుకుంటు తెగ పాపులర్ అయింది.
బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాకా యాంకర్ గా కూడా మారింది అషూ. సోషల్ మీడియాలో తన పిక్కలు కనపడేలా వేసే డ్రెస్సులతో ఫోటోలు పోస్ట్ చేసి కుర్రకారుకి మత్తెక్కిస్తుంది. అంతేకాదు ఆమె చేసే ఓవర్ యాక్షన్ కూడా కొందరికి నచ్చితే, మరి కొందరికి మాత్రం బాగా నచ్చింది.బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత వైరల్ అయింది అషూ రెడ్డి. ప్రస్తుతం ఓ టీవీ షోలో యాంకర్ గా చేస్తుంది. అది కూడా యాంకర్ రవి సరసన జోడిగా యాంకరింగ్ చెస్తుంది. నెగిటివ్ కామెంట్లు అందు కోవడంతో పాటుగా మంచి టాక్ ను కూడా అందుకుంది.
తాజాగా అషూరెడ్డి హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తుందనె వార్తలు వినిపిస్తుంది. యంగ్ హీరో విజయ్ శంకర్ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ని రిలీజ్ చేశారు. ‘ఫోకస్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహాసినీ, భానుచందర్, షాయాజీ షిండే లాంటి సీనియర్ నటీనటులు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కథ మొత్తం సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని కొత్త డైరెక్టర్ సూర్యతేజ తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో అదరగొడుతున్న ఈ బిగ్‌బాస్ భామ హీరోయిన్ గా ఏ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుందొ తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందె...