సుకుమార్ మంచి దర్శకుడే కానీ!!

P.Nishanth Kumar
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు సుకుమార్. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా భారీ స్థాయిలో ఎంట్రీ ఇవ్వగా ఆయన కూడా ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పవచ్చు. దీని కంటే ముందు ఆయన రంగస్థలం వంటి మంచి సినిమా చేసినా కూడా ఓ హీరో ఆయనను నమ్మలేదు. అర్ధాంతరంగా తన సినిమాను క్యాన్సల్ చేయగా దిక్కుతోచని పరిస్థితుల్లో సుకుమార్ ఉన్నాడు. అయితే తనకు ఏ ఆపద వచ్చినా కాపాడతానని మాట ఇచ్చిన అల్లు అర్జున్ చెప్పిన మాట ప్రకారం అడగ్గానే వెంటనే ఆయన తో ఈ సినిమాను చేశాడు.

అలా అలా అతి తక్కువ కాలంలోనే మొదలు పెట్టుకుని షూటింగ్ చేసుకుని పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు దాటుతున్నా కూడా ఇప్పటికీ భారీ స్థాయిలో ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంతటి స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. దేశ విదేశాల్లో సైతం ఈ పాటకు స్టెప్పులు వేసి తమ అభిమానాన్ని చాటి చెప్పారు సెలబ్రిటీలు. చాలా మంది సినిమా ప్రేక్షకులు సైతం చిందులు వేశారు.

సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు ఎంతో ఇంటెలిజెంట్ గా ఉంటాయి అనేది మొదటి నుంచి అందరూ చెప్పే మాట. అయితే ఇటీవల కాలంలో ఆయన తన పంథాను మార్చుకుని మాస్ ప్రేక్షకులకు అనుగుణంగా మాస్ సినిమాలను తెరకెక్కించి హీరోలను సరికొత్తగా చూపిస్తున్నారు. అలా రంగస్థలం, పుష్ప సినిమాలు ఆ కోవలోకే రాగా ఇప్పుడు భవిష్యత్తులో చేయబోయే సినిమాలను కూడా ఆ విధంగానే తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ చెప్పిన సమయానికి సినిమా చేయలేడు అనే ఓ విమర్శ ఎప్పటినుంచో ఆయనపై ఉంది. బడ్జెట్ కూడా అవధులు దాటి పోతుంది అనే విమర్శ కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలు హిట్ అవుతున్నాయి కాబట్టి పెరిగిన బడ్జెట్ తాలూకు కలెక్షన్లు వస్తున్నాయి. ఒకవేళ సినిమా ఫ్లాపయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదురవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: