అయ్యో పాపం: విడాకుల తర్వాత ఐశ్వర్య ఎమోషనల్ పోస్ట్.. ప్రేమంటే..?!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, కోలీవుడ్ సూపర్ స్టార్ భార్యగా అందరికీ సుపరిచితురాలు. అయితే ఇటీవల వార్తల్లో హీరో ధనుష్, ఐశ్వర్య విడిపోయారనే విషయం అందరికీ విదితమే. 2004లో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులున్నారు. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్‌స్టాప్ పెట్టి సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు విడాకులు తీసుకున్నారు. ఈ మేరకు హీరో ధనుష్ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. దీంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
అయితే అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ కపుల్స్ నాగచైతన్య-సమంత కూడా విడిపోయారు. అటూ కోలీవుడ్ ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నారనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. భర్తకు దూరమైన తర్వాత ఐశ్వర్య మీడియా ముందుకు రాలేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్ట్ చేయలేదు. తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పిల్లలు, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, వారితో ప్రేమగా ఉండాలని భావిస్తోంది. కాగా, ఇటీవల ఐశ్వర్య ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఎంతో ఎమోషనల్ అయింది. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొవాలని తెలిపింది. అప్పుడే మనం అనుకున్నది సాధించగమని అన్నారు.
ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేమ అనేది ఒక భావోద్వేగం. ఒక వ్యక్తికి లేదా వ్యక్తిగత విషయాలతో సంబంధం లేనిది. కాలం మారుతున్న కొద్ది ప్రేమకు నిర్వచనం మారుతుంది. కూతురిగా ఉన్నప్పుడు నాన్నంటే ఇష్టం. తల్లిని అయ్యాక నా పిల్లలంటే ఇష్టం. ఇదీ కూడా ప్రేమే. ప్రేమనేది ఒక వ్యక్తితోనే ఆగిపోదు.’’ అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. కాగా, కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మాస్కులు వేసుకుని జాగ్రత్తలు పాటించాలని తన అభిమానులకు సూచనలు ఇస్తున్నారు.