ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను భారీ గా అలరించబోతున్నారు హీరో రామ్ చరణ్. ఆ తర్వాత కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే దక్షిణాదిన భారీ చిత్రాల హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూండగా ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే జెర్సీ సినిమా తో జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో కలిసి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు. మరి అవార్డ్ విన్నింగ్ కథ తో రామ్ చరణ్ తో గౌతమ్ సినిమా చేస్తున్నాడట. ఆ విధంగా చెర్రీ కోసం ఎంతో అద్భుతమైన కథ రాశాడట. అలా భారీ స్థాయి దర్శకులతో ముందుకు వెళుతూ రామ్ చరణ్ తన కెరీర్ ను మరింత ముందుకు పోనిస్తున్నాడు. ఇకపోతే ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే విధంగా ప్రయత్నాలు చేశాడు. దాదాపుగా అది ఖరారు అయిందని చెప్పాలి.
గతంలో ప్రశాంత్ ను కలిసి చిరంజీవి మరియు రామ్ చరణ్ తమ తో సినిమా చేయాలనే విధంగా కోరడంతో కాదనలేకపోయిన ప్రశాంత్, రామ్ చరణ్ తో సినిమా చేయాలని భావించాడు. భారీ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించడంలో ప్రశాంత్ నీల్ కు ఉన్న సత్తా అందరికీ తెలిసిందే. సలార్ కే జి ఎఫ్ చిత్రాలు కూడా ఆ కోవకు చెందిన సినిమాలే. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా అంతకుమించి ఉండేలా చేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దీనికంటే ముందు ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు ప్రశాంత్.