15 ఏళ్లకే ప్రేమలో పడ్డ అనసూయ.. మొదటి సారి భర్తను అక్కడే చూసిందట..!!

Anilkumar
బుల్లితెరపై హొయలు పోతూ.. సెగలు రేపే హాట్ యాంకర్ అనసూయ.అనసూయకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే అప్పటి వరకు బుల్లితెరపై కేవలం యాంకరింగ్ మాత్రమే చేస్తే..ఈమె గ్లామర్ యాంకరింగ్‌కు తెర లేపింది. అనసూయ స్టైలిష్ యాంకరింగ్ అంటే ఏంటో రుచి చూపించింది. ఇక ఈమె తన ఒంపు సొంపులతో చూసే వారి కండ్లను కట్టిపడేస్తూ షోల రేటింగ్ కూడా పెంచింది.అయితే అనసూయ కేవలం బుల్లితెరపై ప్రయాణం చేస్తే నడవదు అనుకుందో ఏమో తెలియదు గానీ.. ఇప్పుడు పెద్ద సినిమాల్లో మంచి


 మంచి క్యారెక్టర్లు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.  అయితే అనసూయ  ఏ ముహూర్తాన రంగస్థలం మూవీ చేసిందో గానీ.. అప్పుడే ఆమె దశ తిరిగింది. క్షణం లాంటి చిన్న సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక తాజాగా వచ్చిన పుష్ప మూవీలో దాక్షాయణిగా భయపెట్టేసింది. పుష్ఫ-2లో ఈమె పాత్ర కీలకం అని తెలుస్తోంది.కాగా ఈమె కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న ఈమె పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అనసూయ ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నించారు.ఇక


 అదే క్రమంలోనే సిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ ఆర్ గా జాబ్ వచ్చింది.అయితే అనసూయ జాబ్ చేస్తున్నప్పుడే ఆమెకు చాలామంది డైరెక్టర్లు సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పారంట. ఇక అసలు విషయానికి వస్తే ఆమెకు 15ఏండ్ల వయసులోనే ప్రేమ పుట్టిందంట.ఆమె భర్త భరద్వాజ్‌ను ఎన్సీసీ క్యాంప్‌లో తొలిసారి కలిసిందంట.అయితే ఇంట్లో వాళ్లను ఒప్పింటి మరీ వీరిద్దరూ పెండ్లి చేసుకున్నారంట.ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా ప్రస్తుతం ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్నారు .ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఈమే తెలుగుతో పాటు మలయాళం కూడా సినిమాలు చేయడానికి రెడీ అయింది అయితే తాజాగా అనసూయ  మలయాళం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: