టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం 'వకీల్ సాబ్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా మంచి హిట్టయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మంచి కం బ్యాక్ హిట్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళం బ్లాక్ బస్టర్ 'అయ్యప్పానుం కోషియం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. యువ దర్శకుడు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ఓ కీలక కూడా పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనాలని బాగా వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ నెల 21 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ అనేది ఇచ్చింది యూనిట్. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ ఎవరుస్తున్నారో వెల్లడించింది.
తెలంగాణ ఐటీ ఇంకా మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్(KTR) ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు వెల్లడించింది. `భీమ్లా నాయక్` సినిమాకి మాటలు ఇంకా స్క్రీన్ ప్లే అందించిన దర్శకుడు త్రివిక్రమ్ ఇంకా అలాగే చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) కలిసి మంత్రి కేటీఆర్‌ని శనివారం మధ్యాహ్నం కలిశారు. ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి `భీమ్లా నాయక్` సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా రావాలని కోరగా, ఆయన వెంటనే ఈవెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.కేటీఆర్ గెస్ట్ గా వస్తున్నారనే వార్తతో `భీమ్లానాయక్`సినిమాకి హైప్ అనేది మరింతగా పెరుగుతుందనే చెప్పాలి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రత్యేకమైన గెస్ట్ లు అవసరం లేదు. ఆయన కోసమే ఆయన అభిమానులు వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడైనా అవసరమైతే ఆయన అన్నయ్య చిరంజీవిని గెస్ట్ గా పిలుస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం ఓ రాజకీయ నాయకుడిని గెస్ట్ గా పిలవడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గానూ మారుతుంది.