బీమ్లా నాయక్ ను మిస్ చేసుకున్న ఆ యంగ్ డైరెక్టర్...?

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భీమ్లా నాయక్ పేరు బాగా మారుమోగిపోతోంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు

ఈ మూవీని ఫస్ట్ డే చూసెయ్యాలని తెగు ఉవ్విళ్లూరుతున్నారట.. మరి ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే మొదటి రోజే భీమ్లా నాయక్ రికార్డులను తిరగరాసేలాగే ఉందని తెలుస్తుంది.. దీనితో పాటు బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంతో ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎవరు జీవితాలు ఎప్పుడు మలుపుతిరుగుతాయో ఎవరికీ తెలియదు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల కెరీర్ సైతం ఒక్క సారిగా మారిపోతు ఉంటుంది.

ఒక్క సక్సెస్ అందుకుంటే చాలా ఈజీగా స్టార్ హీరోలతో మూవీ చేసే చాన్స్ అయితే కొట్టేయ్యొచ్చు. ఉప్పెన మూవీ దర్శకుడు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడుగా.భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర.. గతంలో రాజేంద్రప్రసాద్ తో అయ్యారే మూవీ చేశాడని తెలుస్తుంది.. తర్వాత శ్రీవిష్ణుతో ఒకడుండేవాడు అనే మూవీ కూడా చేశాడు. ఈ రెండు మూవీస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయాయి. ఈ మూవీస్‌తో త్రివిక్రమ్ ను ఆకట్టుకున్న సాగర్  భీమ్లా నాయక్ మూవీకి డైరెక్షన్ చేసే చాన్స్ కొట్టేశాడట.


మొదటగా ఆ మూవీ డైరెక్ట్ చేసేందుకు వివేక్ ఆత్రేయను సంప్రదించాడట మన త్రివిక్రమ్. కానీ అతడు అప్పటికే నానితో ఓ మూవీ కమిట్ అవడంతో ఈ చాన్స్ వదులుకున్నాడట. ప్రస్తుతం మంచి చాన్స్ మిస్ అయ్యానని అతడు కాస్త అప్సెట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుందని ఇందుకు సంబంధించి ప్రీ రిలజ్ ఫంక్షన్ ను సైతం నిర్వహించాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారని వార్త వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: