బాబే కాదు బేబీ కూడా బంగార‌మే...! ఓవ‌ర్ టు కీర్తీ సురేశ్

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెట్టింది మహానటి మూవీ.. ఇక ఇలాంటి సినిమాతోనే ఈమె ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని సంపాదించుకుంది.. ఈ సినిమా తరువాత ఈమె ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడలేదు.. అంతే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీ ల పైన తన దృష్టిని పెడుతూ ఉండేది.. అలా తమిళ, తెలుగు, మలయాళం వంటి భాషలలో విభిన్నమైన సినిమాలలో నటించినది కీర్తి సురేష్.
ప్రస్తుతం మహేష్ సరసన సర్కారి వారి పాటలో గ్లామర్ డాల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది.. ఇక ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది.. అయితే ఈ సినిమాలో గ్లామర్ డాల్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక మలయాళం మూవీ కోసం లాయర్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమైంది. అసలు విషయంలోకి వెళితే కీర్తి సురేష్ ఒకేసారి తమిళ ,తెలుగు భాషల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. ఇక ఈమె నటిస్తున్న చిత్రానికి డైరెక్టర్ వాసి విష్ణు రాఘవ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా థామస్ నటిస్తున్నారు.
ఇందులో కీర్తి సురేష్, థామస్ ఇద్దరూ కూడా లాయర్ గా కనిపిస్తున్నారు.. ఇక ఈ రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమా పోస్టర్ లోని తెలుగులో మహేష్ బాబు, సమంత.. మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో త్రిష-A.R. రెహమాన్, హిందీలో అభిషేక్ బచ్చన్ వంటి వారితో ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్ ని విడుదల చేయించారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ట్లు సమాచారం. వీరందరూ ఈ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: