చైతు ప్లానింగ్ మాములుగా లేదుగా..

Purushottham Vinay
లవ్ స్టోరీ ఇంకా బంగార్రాజు సినిమాలతో టాలీవుడ్ యంగ్ హ్యాండ్సం హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకొని టాలీవుడ్ లో స్టార్ హీరోగా నిరూపించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి నాగచైతన్యకు మంచి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.అయితే ప్రస్తుతం మన యువ సామ్రాట్ నాగచైతన్య చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.  మిడిల్ హీరో రేంజ్ నుంచి స్టార్ హీరో అయిన చైతు ఈ స్థాయిలో సినిమాలతో బిజీగా ఉన్న ఏకైక హీరో అని చెప్పవచ్చు.


ఇక నాగచైతన్య కూడా ఇతర భాషలపై దృష్టి పెట్టి ఆయా భాషల్లో మార్కెట్ ను పెంచుకునే పనిలో పడ్డాడు.ఇక విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం తెలుస్తుంది. అలాగే వినయ్ కనకమేడల డైరెక్షన్ లో ఒక సినిమాకు ఇంకా లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమాకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా విజయాలను సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఒక సినిమాకు నాగ చైతన్య ఓకే చెప్పాడని సమాచారం తెలుస్తుంది.అలాగే పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమాకు చైతన్య ఓకే చెప్పాడు.


సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అలాగే మానాడు సినిమా రీమేక్ లో నటించడానికి నాగ చైతన్య ఓకే చెప్పినట్టు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి ఆన్లైన్ లో జనాలు చూశారు కాబట్టి ఈ సినిమా రీమేక్ లో చాలా మార్పులు చేసే పనిలో వున్నారట మేకర్స్. అలాగే కిషోర్ తిరుమల కూడా నాగచైతన్యతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలతో నాగ చైతన్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్లని అందుకుంటాడో చూడాల్సి ఉంది.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: