అయ్యో అషు రెడ్డి.. అడ్డంగా దొరికి పోయిందిగా?

praveen
ఆర్జీవి భామ అషురెడ్డి.. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఎన్నో రోజుల పాటు రచ్చ చేసింది. కానీ ఎన్ని చేసినా రాని గుర్తింపు అటు సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఒక్క బోల్డ్ ఇంటర్వ్యూ చేసే సరికి వచ్చేసింది. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ బ్యూటీ అని కాకుండా  అందరూ ఆర్జివి భామ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఏదో ఒకటి చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటుంది.



 మొన్నటికి మొన్న ఒక స్టైలిష్ బైక్ పై యాంకర్ రవి తో కలిసి చిరిగిన  జీన్స్ వేసుకుని ఎంతో హాట్గా కనిపించింది అషు రెడ్డి. ఇక కొన్నాళ్లపాటు దీని గురించి చర్చించుకున్నారు అభిమానులు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుందిఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఎప్పటిలాగానే ఈ అమ్మడు ఇటీవలే ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ ఈ ఫోటో తో నెటిజన్లు అందరికీ కూడా అడ్డంగా దొరికిపోయింది అషురెడ్డి. ఇంతకీ ఏం జరిగింది అని అనుకుంటున్నారు కదా.



 అషు రెడ్డి ఇటీవలే కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఇక ఈ ఫోటోలలో తన కార్ నెంబర్ క్లియర్ గా కనిపించింది. ఇంకేముంది ఇదంతా జరిగిన తర్వాత నెటిజన్లు ఊరుకుంటారా.. ఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో తమ మైండ్ పని చెప్పే నెటిజన్లు.. ఇక ఇప్పుడు కూడా కాస్త కొత్తగా ట్రై చేశారు. అషు రెడ్డి కార్ నెంబర్ మీద ఆన్లైన్లో  చలాన్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసారూ. కాగా  2305 రూపాయల  పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అషురెడ్డిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. ముందు పెండింగ్లో ఉండగా చలాన్లు కట్టాలి మేడం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇలా అంటారు అని తెలిసుంటే అషు రెడ్డి తన కారు నెంబర్ ను కవర్ చేస్తూ ఫొటో దిగేదేమో పాపం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: