రష్మిక : వామ్మో.. 25 ఏళ్లకే ఇంత సంపాదనా..?

Purushottham Vinay
కన్నడ హాట్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకవైపు సినిమాలతో  పాటు ఇంకా మరోవైపు పలు కంపెనీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా వుంది. రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలలో చాలా సినిమాలు హిట్ కావడంతో పాటు ఆమె నటన ఇంకా అంద చందాలు యూత్ కి బాగా నచ్చడంతో తెలుగు సినిమాలలో పెద్ద పెద్ద ఆఫర్లు అందుకుంటుంది.తెలుగులో హిట్స్ అందుకొని గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న హిందీలో కూడా అవకాశాలు అందుకుంటూ ఇదే స్టేటస్ ను సొంతం చేసుకుంటానని ఫుల్ గా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంది.ఇక చాలా చిన్న వయస్సులోనే రష్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రష్మిక వయస్సు ప్రస్తుతం కేవలం 25 సంవత్సరాలు అనే విషయం అందరికి తెలిసిందే.


ఇక హిందీలో రష్మిక చేతిలో 2 సినిమాలు ఉండగా ఒక్కో సినిమాకు ఈమె పారితోషికం అక్షరాల 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం తెలుస్తుంది. నేషనల్ క్రష్ గా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ నచ్చిన కథలను ఎంచుకుంటూ ఇంకా అలాగే స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సినిమా సినిమాకు కూడా తన క్రేజ్ ను బాగా పెంచుకుంటుంది.ఇక రష్మిక మందన ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అనేది తెలుస్తోంది.


ఇక రష్మిక మందన ఏడాది సంపాదన విషయానికి వస్తే గత రెండేళ్లలోనే రష్మికకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరగగా ఏడాదికి 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా సంపాదిస్తుందని సమాచారం తెలుస్తుంది. అలాగే ప్రకటనల కోసం ఈ బ్యూటీ 70 లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందని సమాచారం తెలుస్తోంది.ఇలా రష్మిక 25 ఏళ్లకే కోట్లు కోట్లు సంపాదిస్తూ వెనకేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: