హృతిక్ ఇంట్లో కొత్త గర్ల్ ఫ్రెండ్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..!

Anilkumar
అమ్మాయిల కలల రాకుమారుడిగా.. గ్రీకు వీరుడిలా క్రేజ్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.కాగా సుసానేతో విడాకుల అనంతరం కొత్తగా మళ్ళీ రిలేషన్ లాంటి వాటి జోలికి వెళ్లలేదని చెప్పుకుంటారు. కాగా కంగనా రనౌత్ తో ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వచ్చినా అది నిజం కాలేదు. ప్రస్తుతం  హృతిక్ ఓ అమ్మాయితో రెస్టారెంట్ లో కనిపించడంతో.. హృతిక్ మళ్ళీ ప్రేమలో పడ్డాడా అంటూ బాలీవుడ్ మీడియా జోరుగా వార్తలు రాసింది.అయితే ముందుగా రెస్టారెంట్ లో కెమెరాలకి చిక్కిన ఈ జంట ఆ తర్వాత పబ్బులు, ఈవెంట్లు అంటూ కలిసి తిరుగుతూ పబ్లిక్ లోకొచ్చి.. కెమెరాలను చూసి తప్పించుకోవాలని చూసారు.


ఇక ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని నెటిజన్లు అభిప్రాయానికొచ్చేశారు. కాగా ఇప్పుడు నేరుగా హృతిక్ ఆమెను ఇంటికే తీసుకెళ్లాడు.ఇటీవల హృతిక్‌ అంకుల్‌ రాజేశ్‌ రోషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫ్యామిలీ ఫొటో వదిలాడు. అయితే  'సంతోషం అనేది ఎల్లప్పుడూ మా చుట్టూనే ఉంటుంది. కాగా మరీ ముఖ్యంగా ఆదివారం, అందులోనూ మధ్యాహ్న భోజన సమయంలో!' అని దానికి కాప్షన్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ ఫొటోలో హృతిక్‌ కుటుంబసభ్యులందరితో పాటు యువనటి సబా ఆజాద్ కూడా ఉంది.కాగా ఈ పోస్ట్‌పై హృతిక్‌ స్పందిస్తూ.. 'అవును చాచా, ఇది మాత్రం వాస్తవం. నువ్వైతే భలే నవ్విస్తావ్‌' అని రిప్లై ఇచ్చాడు.


అయితే సబా కూడా 'అద్భుతమైన ఆదివారం' అంటూ కామెంట్‌ వదిలింది. కాగా వెండితెర మీద ఇంకా సినిమాలు మొదలు పెట్టిన సబా ఆజాద్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్ లో స్టార్ యాక్ట్రెస్. అయితే హృతిక్ తో పరిచయం ఎలా అయిందో కానీ వ్యవహారం ఇప్పుడు ఫ్యామిలీతో కలిసిపోయే వరకు వచ్చింది.దీనితో ప్రేమేనని వాళ్ళు ఎక్కడా ఓపెన్ కాలేదు కానీ.. పరిస్థితి చూస్తుంటే మాత్రం సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అంటున్నారు నెటిజన్లు.హృతిక్ రోషన్ సినిమా విషయానికి వస్తే తమిళంలో హిట్ అయిన విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్నాడు ఇటీవలే సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని కనబరిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: