పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే, అలాంటి హీరో నుండి ఏదైనా అప్ డేట్ వచ్చిన లేక ఏదైనా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన, సాంగ్స్ ని విడుదల చేసిన, ట్రైలర్ ను విడుదల చేసిన అవి అతి అతి సమయంలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అది మాత్రమే కాకుండా కొన్ని గంటల్లోనే సరికొత్త రికార్డ్ లను కూడా సృష్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి, ఇది ఇలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే, భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల అవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను నిన్న అనగా ఏప్రిల్ 21 వ తేదీన చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ పూర్తి పేరు అందించాడు, ఈ ట్రైలర్ ద్వారా పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానాల మధ్య అదిరిపోయే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ మరియు దగ్గుబాటి రానా లు పలికిన డైలాగ్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి, ఇలా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్న భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన కేవలం 11 గంటల్లోనే 7 మిలియన్ లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది, అలాగే ఈ సినిమా ట్రైలర్ కు 11 గంటల్లోనే 9 లక్షలకు పైగా లైక్స్ ను కూడా సాధించింది. ప్రస్తుతం కూడా భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది, ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.