వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ దర్శకుడు ఇండియా రేంజ్ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మాత్రం ఆ రేంజ్ విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనుకబడి పోయాడు, రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయం పక్కన పెడితే ఏదో ఒక విషయంపై ఎప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇది మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మ ఆషూ రెడ్డి, ఆరియన లాంటి బ్యూటీ లతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి కూడా అప్పట్లో ఫుల్ రచ్చ చేశారు, ఇలా అనేక విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా కూడా ఒక విషయంపై తనదైన రీతిలో స్పందించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే, ఈ సినిమాను ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది, ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్న ఈ సినిమా ట్రైలర్ పై తనదైన రీతిలో రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. పికే ఫ్యాన్స్ అంటూనే రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో చేయాల్సిన కామెంట్లు చేసేసాడు, అయితే ఈ మూవీ ట్రైలర్ చూశాక ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ టైటిల్ కి బదులు ‘డానియల్ శేఖర్’ అని టైటిల్ పెట్టాల్సింది అంటూ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.