మెగాస్టార్ చిరు : కటిక పేద వాడిగా సురేఖ మెడలో !

Divya
సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు.. ఆయన ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ కంటూ తమ కుటుంబానికి ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసారు.. ఇక ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన..ఈ సినిమాల తో ఎందరికో ఆదర్శంగా నిలవడమే కాకుండా మంచి మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. నాటి తరం హీరోయిన్ల నుంచి నేటి తరం హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరితో జోడీగా నటించిన చిరంజీవి తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేశాడు.

పునాదిరాళ్లు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన చిరంజీవి ఇప్పటికీ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అంతే దూకుడుతో ముందుకు కొనసాగుతున్నారు.. ఆ కాలంలోనే చిరంజీవి లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన ప్రముఖ హాస్య బ్రహ్మ అల్లురామలింగయ్య  మెగాస్టార్ చిరంజీవికి తన కూతురు సురేఖ ను ఇచ్చి .1980 ఫిబ్రవరి 20 వ తేదీన వివాహం జరిపించారు.

ఈ ఏడాదితో వీరు 42 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని సంతోషంగా పూర్తిచేశారు..  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది.. చిరంజీవి తన పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమలీలలు అనే ఒక సినిమాలో చాలా బిజీగా ఉన్నారు.. సినిమా షూటింగ్ సమయంలో నూతన ప్రసాద్ ఎంతో బిజీగా ఉండటం వల్ల ఆయన షెడ్యూల్ కారణంగా పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నామని.. కానీ నిర్మాత షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసి పెళ్ళికి సమయం ఇచ్చారు అని చిరంజీవి వెల్లడించారు..

పెళ్లి పీటలపై తాళికట్టే సమయానికి చిరంజీవి చొక్కా చిరిగిపోయింది.. ఇక ఇదే విషయాన్ని సురేఖ తెలియజేస్తూ.. చొక్కా మార్చుకోమని సూచించారట.. చిరిగిన చొక్కా తో తాళికట్టలేనా అంటూ ఆ చొక్కాతోనే సురేఖ మెడలో మూడు ముళ్ళు వేసాను అని.. ఇక మా జీవిత బంధం సంతోషంగా కొనసాగుతోంది అని చిరు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: