అక్కినేని కుటుంబానికే ఎందుకిలా.. బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో?

praveen
సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వారు ఎన్టీఆర్, ఏఎన్నార్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు రావడంలో ఇద్దరు హీరోలు చేసిన కృషి అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ముఖ్యంగా మద్రాసు నుంచి హైదరాబాద్ కు తెలుగు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అవ్వడం లో వీరి పాత్ర ఎంతో కీలకం. ఇక నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ నవమన్మధుడు గా మారిపోయాడు. 60 ఏళ్లు దాటి పోతున్నాప్పటికి నాగార్జున అమ్మాయిల కలల రాకుమారుడే. ఇప్పుడు నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోలుగా రాణిస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో  పెద్ద కుటుంబంలో ఒకటిగా కొనసాగుతున్న అక్కినేని కుటుంబాన్ని మాత్రం గత కొన్ని రోజుల నుండి ఒక దురదృష్టం వెంటాడుతూనే ఉంది.


 కేవలం ఒక తరానికి మాత్రమే ఈ దురదృష్టం పరిమితం కాలేదు. దాదాపు  మూడు తరాలు కూడా ఈ బాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. నాగార్జున లెజెండరీ డైరెక్టర్ రామనాయుడు కుమార్తె శ్రీ లక్ష్మి తో మొదటి వివాహం జరిగింది. కానీ నాగచైతన్య పుట్టిన తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చివరికి ఈ వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది. ఆ తర్వాత అమలతో ప్రేమలో పడిన నాగార్జున ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. కేవలం నాగార్జునకి కాదు ఆయన ఇద్దరు కుమారులు కూడా పెళ్లి అస్సలు కలిసి రాలేదు.



 పెద్ద కుమారుడు నాగచైతన్య సమంత ను వివాహం చేసుకున్నాడు. వీరిది కూడా ప్రేమ పెళ్లి. వీరి జంట టాలీవుడ్లో అందరికి ఫేవరెట్ గా మారిపోయింది. ఎక్కడ  కనిపించిన సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు సమంత నాగచైతన్య. ఇక అక్కినేని కోడలు గా సమంత క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇటీవల తమ నాలుగేళ్ల బంధానికి గుడ్ బై చెబుతూ విడాకులు తీసుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాగచైతన్య సమంత. అక్కినేని హీరో అఖిల్  ది మరో విచిత్రమైన గాథ. అఖిల్ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నాడు.నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ చివరికి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.


 ఇక అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ ఆయన సోదరి విషయంలో కూడా ఇదే జరిగింది. సుమంత్ టాప్ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ విడిపోయారు.. ఇక ఆ తర్వాత సుమంత్ సోదరి సుప్రియ హీరో చరణ్ రెడ్డి ని వివాహం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య  మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ రెండో పెళ్లి చేసుకోలేదు సుప్రియ. అందరికీ పెళ్లి అనే కాన్సెప్ట్ కలిసొస్తే అక్కినేని కుటుంబానికి మాత్రం పెళ్లి అనే కాన్సెప్ట్ దురదృష్టంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: