బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయాలని అందరు హీరోలు కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్కో దర్శకుడి ఒక్కో స్టైల్ ఉన్నట్లుగానే బోయపాటి శ్రీను కి స్పెషల్ స్టైల్ ఉంది. మొదటి నుంచి ఆయన సినిమా చేసే విధానం ఎంతో బాగుంటుంది. మాస్ చిత్రాలను బాగా ప్రజెంట్ చేయగల దర్శకుడు బోయపాటి శ్రీను తో సినిమా చేస్తే తప్పకుండా స్టార్ హీరోల జాబితాలో చేరవచ్చు అని భావిస్తూంటారు స్టార్ హీరోలు. స్టార్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేస్తే తప్పకుండా విజయం సాధించినట్లే అని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా బోయపాటి శ్రీను కు ఈ భారీ స్థాయిలో ఇమేజ్ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఆయన రామ్ హీరోగా ఇప్పటివరకు కు చేయని చక్కని కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పరిణితి చోప్రా హీరోయిన్ గా అనుకున్నారు. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విజయం సాధించేలా చేయాలని బోయపాటి భావిస్తుండగా దానికి అన్ని విధాల సహకరించపోతున్నాడట. ఇకపోతే తాజాగా ఈ సినిమా విషయంలో ఓ సెంటిమెంట్ అభిమానులను కలవర పరుస్తోంది .
ఇప్పటివరకు బోయపాటి చేసిన సినిమాలను గమనిస్తే సీనియర్ హీరోలతో చేసిన సినిమాలతోనే ఆయన విజయాలు అందుకొన్నాడు. యువ హీరోలతో సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయం అందుకోలేక పోయాడు. ఈ నేపథ్యంలో ఆయనకు రామ్ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే సీనియర్ హీరోలతో బోయపాటి సినిమా చేసే విషయం లో వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథను తయారు చేస్తున్నాడు. అదే విధంగా యువ హీరోల బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా కథను ఎంచుకోవడం వల్ల బోయపాటి శీను ఆ హీరోలతో చేసే సినిమాలు ఉంటే అవి హిట్ అవుతాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏవిధమైన కసరత్తులు చేస్తాడు చూడాలి.