వావ్ : అల్లుఅర్జున్ కొత్త ఇల్లు మాములుగా లేదుగా...!!

murali krishna
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌కు అయితే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన స్టైలీష్‌ లుక్‌ మరియు భిన్నమైన డ్యాన్స్‌, అంతకుమించిన వ్యక్తిత్వం..ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉంటాడు మన బన్నీ. అందుకే స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ గా ఆయన ఎదిగాడు. ఇక బన్నీ ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం అందరికి తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్స్‌ కూడా ప్లాన్‌ చేస్తాడు. లేదా ఇంట్లోనే పిల్లలతో సరదాగా సమయాన్ని ఆస్వాదిస్తాడు. ఇక వీలు చిక్కినప్పుడల్లా భార్య పిల్లలతో హైదరాబాద్‌ రోడ్లపై కారులో ఆయన షికారు కొడుతుంటాడు.

 

ఇక తన ప్రతి మూవీ ఈవెంట్‌కు కుటుంబంతోనే కలిసి వస్తాడు బన్నీ. అలాంటి బన్నీ తన ఫ్యాషన్‌లో అయినా లగ్జరీ విషయంలో అయినా అస్సలు 'తగ్గేదే లే' అంటాడు. అందుకే అతడు వాడే కాస్ట్యూమ్స్‌ నుంచి కారు బంగ్లాల వరకు అన్ని భిన్నంగా మరియు లగ్జరీగా ఉండేలా చూసుకుంటాడు. అయితే స్టార్‌ హీరో అయిన బన్నీ విలాసవంతమైన కొత్త ఇల్లు ఇటీవల కట్టించుకున్నాడట. పుష్పతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న బన్నీపైనే ఇప్పుడు అందరి ఫోకస్‌ పడింది.. ఈ నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్ల కలెక్షన్స్‌ మాత్రం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి అవేంటి? వాటి స్పెషాలిటీ ఏంటో మనం కూడా ఓ సారి చూసేద్దాం.

 
బెసిగ్గా బ్లాక్‌ను ఇష్టపడే ఈ ఐకాన్‌ స్టార్‌ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా చూసుకున్నాడట.. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్‌ ధర రూ. 7 కోట్లు అని తెలుస్తుంది.. ముద్దుగా దీనిని ఫాల్కాన్‌ అని ఆయన పిలుచుకుంటాడట బన్నీ. ఈ వ్యాన్‌లో భారీ టీవీ సెట్, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ కూడా అమర్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడట. దీనిపై ముందులో భాగంగా ఫాల్కోన్‌ అని రాసి ఉండగా.. ఇరువైపు ఏఏ(AA) అని ఉంటుంది.


2 ఎకరాల్లో 100 కోట్లతో విలాసవంతమైన బంగ్లా!
సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి ఉండడం సహజమే.హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు 'బ్లెస్సింగ్'. రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా అల్లు అర్జున్ ఈ ఇంటిని తన టేస్ట్‌కు తగ్గట్టుగా నిర్మించుకున్నాడని తెలుస్తుంది.. పూర్తిగా సహజమైన తెలుపు రంగుతో పెయింటింగ్‌ చేసిన ఈ ఇంటి లోపల పెద్ద స్విమ్మింగ్‌ ఫూల్‌ మరియు జిమ్‌, హోమ్‌ థియేటర్‌, స్పెషల్‌ పార్టీల కోసం బార్‌ జోన్‌, పిల్లల కోసం ప్లేయింగ్‌ ఏరియా కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: