ఆ నటుడుని నష్ట జాతకుడని అన్నారంట.. కానీ..!!
మిక్కిలినేని పూర్తి పేరు రాధాకృష్ణమూర్తి. ఆయన మొదటగా రంగస్థల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రంగస్థల నటుడిగా చేసే సమయంలో స్త్రీ పురుష పాత్రలలో నటిస్తూ బహుముఖ ప్రజ్ఞా శైలిని చాటే వారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొని 5 సార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు.
అయితే మిక్కిలినేని గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద ఎంతో ఆసక్తి ఉండేది. ఈ తరుణంలోనే ఆయన తక్కువ సమయంలోనే రంగస్థల నటుడిగా రాణించారంట. అంతేకాక.. యువకుడిగా ఉన్నప్పుడు ప్రజానాట్య మండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా కూడా వ్యవహరించారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించారు. సినిమా సినిమాకి విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుండేవారు.
ఆయన కాకుండా అతని సతీమణి కూడా ఎన్నో నాటకాలలో నటించారు. మిక్కిలినేని చిన్నప్పుడు నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పైకి వచ్చారంట. మొదట్లో అయితే ఆయనను నష్ట జాతకుడు అంటూ బంధువులు సూటిపోటి మాటలు అంటుండేవారంట. కాగా.. ఆయన బాల్యాన్ని అతికష్టంగా గడిపిన మిక్కిలినేని నష్ట జాతకుడు అని అనిపించుకున్న స్థాయి నుంచి ఏకంగా అతను ఒక గొప్ప నటుడు అనిపించుకునే స్థాయికి ఎదిగారు. అలా అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. కాగా, ఆయన తన 95వ ఏట మృతి చెందారు.