ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తేజ.. ఎందుకింత గ్యాపయ్యా..!!

P.Nishanth Kumar
ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ స్థాయి విజయాలను ఖాతాలో వేసుకొని క్రేజీ డైరెక్టర్ గా మారి సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న డైరెక్టర్ తేజ. రాంగోపాల్ వర్మ శిష్యుడు గా తన కెరియర్ ను తెలుగులో ప్రారంభించి కొన్ని ప్రేమ కథా చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసాడు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ చాలా కాలం వరకు హిట్స్ కొట్టే లేకపోయాడు. చాలా కాలం తర్వాత నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాతో హిట్ కొట్టి తాను ఉన్నాను అని చాటుకున్నాడు.

అయితే హిట్ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఆయనలో కన్సిస్టెన్సీ ఉండటం లేదు అనే ఓ విమర్శ మొదటి నుంచి వస్తుంది. తొలినాళ్ళలో సినిమాలు చేసిన విధంగా ఆయన సినిమాలు చేయలేకపోతున్నాడు అనే విమర్శలు ఎక్కువయ్యాయి. దానికి తగ్గట్లుగానే ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన సీత చిత్రం దారుణంగా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరో గా ఓ సినిమా చేస్తున్న తేజ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అహింస గా నిర్ణయించి నట్లు తెలుస్తుంది. ఉదయ్కిరణ్ నితిన్ వంటి యువ హీరోలకు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు ఈ హీరోకి కూడా మంచి సినిమాను తీసుకు వస్తారని భావిస్తున్నార  ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నాడు. ఇక తేజ తనయుడు అమితాబ్ తేజ హీరోగా ఇప్పుడు మరొక సినిమాను మొదలు పెట్టాడు. విక్రమాదిత్య అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. మంగళవారం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: