సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం..!!

Divya
కన్నడ రేడియో జాకీగా అలాగే లేడీ కమెడియన్ గా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ జే రచన మంగళవారం మధ్యాహ్నం సమయంలో గుండెపోటుతో మరణించి.. సినీ ఇండస్ట్రీకి విషాదాన్ని మిగిల్చింది. ఇక ఈమె వయసు 39 సంవత్సరాలే కావడం అత్యంత బాధాకరమని చెప్పవచ్చు. జెపి నగర్ లోని తన ఫ్లాట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తన సన్నిహితులతో తెలియజేసినదట. ఇక హుటా హుటిన స్నేహితులు ఆమెను దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో చేర్పించగా.. మార్గమధ్యలోనే ఆమె గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తేల్చారు.


ఆర్ జె రచన బెంగళూరులో రేడియో జాకీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈమెకు ఎంతో మంది అభిమానులు కూడా వున్నారు. కేవలం యాంకరింగ్ లోనే కాదు హాస్యాన్ని పండించడం లో కూడా అంతే దిట్ట అని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో తన యాంకరింగ్ తో .. డైలాగులతో.. పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఆర్ జే రచన మంచి పేరును సంపాదించుకున్నారు. ఇకపోతే ఈమె మరణానికి కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీమణులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఆర్జే రచన అంటే అత్యంత ఎక్కువగా ఇష్టపడే వారిలో ప్రముఖ నటీమణి శ్వేతా చెంగప్ప కూడా ఒకరు. ఇక ఈమెకు రచన అంటే చాలా ఇష్టం . ఇక ఈమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన శ్వేత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా రాసుకొచ్చింది. రచన చాలా సెన్సిటివ్.. ఇక భాషపై ఆమెకు ఉన్న పట్టు అమోఘం. వ్యక్తిగతంగా ఈమెను నేనెప్పుడూ కలవ లేదు కానీ ఈమె మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది..  నాకు ఇష్టమైన ఆర్ జే రచన కూడా ఒకరు.. ఇక అందుకే  నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ దిగ్భ్రాంతికి గురైంది. శ్వేత చెంగప్ప.


ఈమెతో పాటు డాన్సింగ్ స్టార్ సీజన్ వన్ కంటెస్టెంట్ ఆర్ జే ప్రదీప్ కూడా రచన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన ఇలా గుండెపోటుతో అతి చిన్న వయసులోనే మరణించడం వర్ణనాతీతమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: