'అంటే సుందరానికి 'నుంచి బర్త్ డే స్పెషల్ వచ్చేసింది..
మొన్నీమధ్య శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించాడు. ఆ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంది. డిసెంబర్ 24 వ తేదీన విడుదల అయిన ఇప్పటికీ అంతే టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమాలో నాని పాత్ర సరికొత్తగా ఉంది. బెంగాలి కథ ఆదారంగా సినిమా తెరకెక్కింది.. మొత్తానికి భారీ విజయాన్ని అందుకుంది.. హిట్ అవ్వడంతో పాటుగా మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. దాంతో మరో సినిమాలొ నటిస్తూన్నారు.. ఆ సినిమా అంటే సుందరానికి.. ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ఎప్పుడో మొదలయ్యాయి. సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ నటి నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి బర్త్ డే హోమం పేరుతో ఓ టీజర్ ను వదిలింది చిత్ర యూనిట్. ఈ టీజర్ లో హోమం చేస్తూ నాని కనిపించాడు.. అలాగే “అంటే సుందరానికి” మూవీని జూన్ 10 వ తేదీన థియేటర్ల లలో విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ రెండు అప్డేట్లతో. నాని ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం ఎర్పడేలా చెస్తుంది...ఈ సినిమాలో నాని పాత్ర కామెడీగా కనిపిస్తున్నాడు..సినిమా ఎలా ఉంటుందొ చూడాలి..