సీనియర్ హీరో నరేష్ మొదటి భార్య ఎవరు.. వాళ్ళు ఎందుకు విడిపోయారు..?

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో 1980ల కాలంలో కామెడీ సినిమాల కంటే ఎక్కువగా యాక్షన్ సినిమాలకే ప్రియారిటి ఉండేది. అప్పట్లో పెద్ద డైరెక్టర్ అయిన పెద్ద హీరో అయినా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపేవారు. అలాంటి సమయంలో ఓ ఇద్దరు హీరోలు మాత్రమే కామెడీ సినిమాలు చేసేవారు. వారిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఒకరైతే అయితే మరొకరు నరేష్.. సినిమా ఇండస్ట్రీలో కృష్ణ, విజయనిర్మల వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ కి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఎక్కువగా ఉండడంతో సినిమా అవకాశాలు కూడా త్వరగా రావడం.. అలా కెరీర్లో బాగా సెటిలైపోయాడు. ముఖ్యంగా తన సినిమాల్లో కామెడీ టైమింగ్ తో నరేష్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. 


1982లో 'ప్రేమ సంకెళ్లు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నరేష్. ఈ సినిమాని తన తల్లి విజయనిర్మల డైరెక్ట్ చేయడం విశేషం. ఆ తర్వాత రామచంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'చిత్రం భళారే విచిత్రం' సినిమాతో పాటు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఆ రెండు సినిమాలు హీరోగా నరేష్ కి భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఆ తర్వాత అప్పటి కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు నరేష్. ఆ దంపతులకు ఇప్పుడు నవీన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవలే నవీన్ హీరోగా ఇండస్ట్రీకి 'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.


అయితే నరేష్ కు మొదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఏపీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డిసోదరుడి కూతురిని వివాహం చేసుకున్నాడు. నరేష్ రెండో వివాహం చేసుకునే నాటికి అతని వయస్సు 50 సంవత్సరాలు దాటింది. ఇక ఆ పెళ్లికి మంత్రి రఘువీరారెడ్డి సైతం హాజరయ్యారు. అయితే ఆ పెళ్ళి కూడా పెటాకులైంది. ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటిస్తున్న పవిత్ర లోకేష్ తో నరేష్ ఎక్కువ చనువుగా ఉంటున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెను వివాహం చేసుకోవాలని కూడా నరేష్ అనుకుంటున్నట్లు  ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: