ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా సినిమా పుష్ప .ఇక ఈ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన కథానాయికగా... సుకుమార్ ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశాన్ని కల్పించారు.అయితే అలాంటి వారిలో సత్రు కూడా ఉన్నారు .. పుష్ప ఫస్ట్ హాఫ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన సత్రు గురించి ప్రస్తుతం ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.అంతేకాదు ఆరడుగుల ఎత్తు చురకత్తుల్లాంటి చూపులతో సత్రు విలన్ గా ఎంతో వైల్డ్ గా కనిపిస్తాడు. కాగా సత్రు చాలా సినిమాల్లో నటించినా నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీరప్రేమగాథ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈయన వ్యక్తిగత వివరల్లోకెళితే సత్రు జన్మించి.. పెరిగింది రాజమండ్రిలో అయినా వీరి కుటుంబం మాత్రం ఒడిస్సా లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. కాగా ఈయన ఒడిస్సా నుంచి హైదరాబాద్ చేరుకున్న ... మైక్రో బయాలజీ పూర్తి చేశారు.ఇక సుత్రు రానా హీరోగా నటించిన లీడర్ సినిమా లో .. తన స్నేహితుడి ద్వారా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.అంతే కాదు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
అయితే ఇటీవల పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఈయనకు.. సుకుమార్ తో గల సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమా లో ఈయన కూడా నటించాడు. కాగా ఈ కారణంతోనే పుష్ప సినిమాలో కూడా అవకాశాన్ని కల్పించడం తో ఆయన తన నటనను నిరూపించుకున్నాడు. అయితే అలా వీరి మధ్య ఉన్న స్నేహబంధం తోనే సుకుమార్ సత్రు కి మళ్లీ అవకాశం ఇచ్చాడు...!!