నందమూరి వంశంలో మూడోతరం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మన
జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత చరిష్మా ను పుట్టుకతోనే అందిపుచ్చుకున్న
ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ అలనాటి నటి సార్వభౌముడు నందమూరి తారకరామారావు కి ప్రతిరూపంగా ప్రస్తుతం కొనసాగుతున్నాడట .ఇక
టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న
జూనియర్ ఎన్టీఆర్ నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అని చెప్పవచ్చు.
చూడాలని ఉంది అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయిన
ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు.
తన నటన డాన్సులతో తెలుగు ప్రేక్షకులందరి చూపు తన వైపు వైపు తిప్పుకోవడం లో
సక్సెస్ అయ్యాడు మన
జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ప్రస్తుతం ఆయన దర్శక ధీరుడు
రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో
కొమరం భీమ్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించ పోతున్నాడు ఈ నందమూరి హీరో. ఇకపోతే
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు తన
భార్య లక్ష్మి ప్రణతిపై అమితమైన
ప్రేమ చూపిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఎక్కడ కనిపించినా కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. అయితే ఒక బుల్లితెర షో లో లక్ష్మీప్రణతినీ పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లిన సమయంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారట
జూనియర్ ఎన్టీఆర్.
పెద్దలతో కలిసి
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి నీ ఆమె ఇంట్లో
పెళ్లి చూపులు చూసేందుకు వెళ్ళాడట.
లక్ష్మీ ప్రణతి తల ఎత్తుకొని
ఎన్టీఆర్ ని చూడటం లేదట. ఆ తర్వాత
లక్ష్మీ ప్రణతి తో మాట్లాడిన సమయంలో ఈ
పెళ్లి అంటే మీకు ఇష్టమేనా అని అడిగాడట.. అయితే ఈ ప్రశ్నకు లక్ష్మీప్రణతి సమాధానం చెప్పకుండా సైలెంట్ గానే ఉండిపోయిందట.
ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత పెళ్లికి 8 నెలల గ్యాప్ కూడా వచ్చిందట. ఈ గ్యాప్ లో
ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి మాట్లాడుకున్న చాలాసార్లు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారట
జూనియర్ ఎన్టీఆర్. ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ
లక్ష్మీ ప్రణతి మాత్రం నో అనే ఒకే ఒక సమాధానం చెబుతూ ఉండేదట. ఇక ఆ సమయంలోనే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని.. మగువ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అని అర్థం చేసుకున్నాడట ఈ నందమూరి హీరో. కాగా వీరిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ప్రస్తుతం భార్గవ్‌రామ్ మరియు అభయ్
రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు..