ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్ లలో సందడి చేయబోతుంటే మరికొన్ని సినిమాలు ఓ టి టి లో సందడి చేయబోతున్నాయి ఆ  సినిమాల గురించి తెలుసుకుందాం...

వలిమై : కోలీవుడ్ స్టార్  అజిత్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా లో కార్తికేయ విలన్ గా నటించాడు,  ఈ మూవీ ఫిబ్రవరి 24 వ తేదీ న విడుదల కాబోతుంది, ఈ మూవీ కి హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించాడు.

భీమ్లా నాయక్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  దగ్గుపాటి రానా హీరోలుగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా కు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు, ఈ మూవీ  ఫిబ్రవరి 25 వ తేదీన  విడుదల కాబోతుంది.

గంగూబాయ్‌ కతియావాడి : ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ కి వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేసే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు, ఈ మూవీ  ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల కాబోతుంది.

 ఈ వారం ఓ టి టి లలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు...

ఆహా...
సెహరి : ఫిబ్రవరి 25 వ తేదీ నుండి ఈ సినిమా ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌..
ద ప్రొటేష్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 25.

నెట్‌ఫ్లిక్స్‌..
ద ఫేమ్‌ గేమ్‌... హిందీ సిరీస్‌... (ఫిబ్రవరి 25)
వైకింగ్స్‌: వాల్హా ...వెబ్‌ సిరీ స్‌... (ఫిబ్రవరి 25)

జువైనల్‌ జస్టిస్‌... వెబ్‌ సిరీస్‌... (ఫిబ్రవరి 25)
ఎ మాడియా హోమ్‌ కమింగ్‌... హాలీవుడ్‌... (ఫిబ్రవరి 25)


డిస్నీ హాట్‌ స్టార్‌...
స్టార్‌ వార్స్‌ ఒబీ –వాన్‌ కెనోబి ..వెబ్‌ సిరీస్‌.. (ఫిబ్రవరి 25)

జీ 5..
లవ్‌ హాస్టల్‌ ...హిందీ...(ఫిబ్రవరి 25)

సోనీ లివ్‌..
అజగజాంతరం ..మలయాళం.. (ఫిబ్రవరి 25)

ఎ డిస్కవరీ ఆఫ్‌ విచెస్‌ ..వెబ్‌ సిరీస్‌.. (ఫిబ్రవరి 25)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: