ఆ టీమ్ తో సినిమా చేయాలనుకుంటున్న నితిన్..!!
ఈ విజయోత్సవం సందర్భంగా నిత్యామీనన్ , నితిన్ పి.సి.శ్రీరామ్ , విక్రమ్ కె కుమార్ , అనూప్రూబెన్స్ ఇలా తమ ఆనందాన్ని ఆవిష్కరించడం జరిగింది. నితిన్ మాట్లాడుతూ.. ఈనెల 24వ తేదీకి సినిమా వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ..ఇక నా కెరీర్లో ఒక మంచి సినిమా ఇది ..నటుడిగా రీ బర్త్ ఇచ్చిన సినిమా కూడా ఇదే.. ఇక నా సినీ కెరీర్లో ఇంత మంచి సినిమా నాకు అందించినందుకు విక్రం కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కెమెరామెన్ పీసీ శ్రీరామ్ కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాను కెమెరాలో బంధించారు.
ఇక ఇష్క్ సినిమా ఇంత స్పెషల్ గా రావడానికి కారణం కథ , కథనం తో పాటు దర్శకత్వం అలాగే పి.సి.శ్రీరామ్ విజువల్స్ , అనూప్, అరవింద్ ల మంచి సంగీతం అని చెప్పవచ్చు. ఇక అందుకే ఇంత మంచి పేరు తీసుకొచ్చిన ఈ సినిమా టీం తో నాకు మరొకసారి పనిచేయాలని ఉంది. తప్పకుండా దర్శకుడు మళ్ళీ కథ సిద్ధం చేస్తే ఇదే టీం తో ఇంకొక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ నితిన్ తెలిపాడు. ఇక నితిన్ తో పాటు నిత్యా మీనన్ ను కూడా తన అనుభవాలను పంచుకోవడం జరిగింది.