ఇక టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా కోసం తొలి సారి `ఊ అంటావా .. ఊహూ అంటావా.. ` అంటూ ప్రత్యేక గీతంలో కనిపించి షాకిచ్చిన సమంత. ఈ పాటతో మరింత పాపులర్ అయి ఇంకా ఎక్కువ క్రేజ్ తో బాలీవుడ్ లోనూ క్రేజీ ప్రొడక్షన్ కంపనీతో బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందంటూ గాసిప్స్ అనేవి వినిపించాయి.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న సమంత ఇక టైం చిక్కినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా లైఫ్ కోట్స్ షేర్ చేస్తోంది.ఇక ఇదిలా వుంటే తాజాగా సమంత సోషల్ మీడియా ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన ఫొటోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఫేమస్ హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ `విల్` పుస్తకం నుంచి ఓ కోట్ ని షేర్ చేసింది సమంత.
గత ముప్పై సంవత్సరాలుగా అందరిలాగే వైఫల్యం - నష్టం - అవమానం - విడాకులతో వ్యవహరించాను . నాకు ప్రాణహాని అనేది వుంది. నా డబ్బులు పోయాయి. నా వ్యక్తిగత విషయాలని ఆక్రమించారు. నా కుటుంబం బాగా విచ్చిన్నమైపోయింది. అయినా ప్రతిరోజూ కూడా కాంక్రీట్ కలిపి ఇటుకను పేర్చాలి. ఇక మీరు ఏదారిలో వెళుతున్నారో తెలియదు.కానీ అక్కడ ఎల్లప్పుడూ కూడా ఒక ఇటుక మీ ముందు ఎదురుచూస్తూ వుంటుంది. అది కూడా పేర్చేందుకే సిద్ధంగా వుంది. కానీ నువ్వు మాత్రం ఆ ఇటుకను పేరుస్తున్నావా? ` అని సమంత ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన ఫొటోల్లో ఈ కోట్ వుంది. సమంత ఉన్నట్టుండి ...విల్ స్మిత్ విల్ పుస్తకంలోని ఈ కోట్ లని మాత్రమే ఎందుకు షేర్ చేసిందనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ చర్చ జరుగుతోంది.దీన్ని బట్టి చూస్తే సమంత ఇంకా బాధలోనే ఉందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.