భీమ్లా నాయక్ : రానా వల్ల తెగ ఇబ్బంది పడ్డ పవన్?

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 అంటే నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక ఎన్నో రోజుల నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అసలు సిసలైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కావాలి అంటూ వేచి చూసిన ప్రేక్షకులు అందరూ కూడా భీమ్లా నాయక్ సినిమాకి తరలి వెళ్లారు. ఇక ఏపీలో బెనిఫిట్ షో లకి అనుమతి లేకపోవడంతో ఎంతోమంది ఏపీ నుంచి తెలంగాణ మరి తెలంగాణలో బెనిఫిట్ షోలు చేశారు అని చెప్పారు. ఇక ప్రస్తుతం భీమ్లా నాయక్ గర్జనతో థియేటర్లు మొత్తం దద్దరిల్లి పోతున్నాయి.



 అయితే ఇప్పటివరకూ గబ్బర్ సింగ్,  సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు పవన్ కళ్యాణ్. కానీ భీమ్లా నాయక్ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ పాత్ర మునుపెన్నడూ చూడనంత పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పాలి. పవన్ కోసమే ఈ పాత్ర పుట్టిందేమో అని అనిపిస్తూ ఉంటుంది సినిమాలు చూస్తుంటే. ఇక మరోవైపున మాజీ ఆర్మీ ఆఫీసర్ డానియల్ శేఖర్ పాత్రలో నటించిన రానా నట విశ్వరూపం చూపించి అదరగొట్టాడు. ఇక ప్రతీ పాత్రలో ఒదిగిపోయే నిత్య మీనన్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది.



 ఇలా ఎవరికి వారు పాత్రలో ఒదిగిపోయి నటించగా ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒకరకంగా భీమ్లా నాయక గర్జన ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టెలాగే ఉంది అన్నది తెలుస్తుంది. అంతా బాగానే ఉంది కానీ రానా తో నటించడం వల్ల పవన్ తెగ ఇబ్బంది పడి పోయాడు. అయితే నటన విషయంలో కాదు హైట్ విషయంలో.. రానా టాలీవుడ్లోనే  టాలెస్ట్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మరీ పొట్టిగా లేడు కాని అందరిలాగానే నార్మల్ హైట్ ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నటించే సమయంలో రానా హైట్ మ్యాచ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువ హైట్ ఉన్న పాదరక్షలు వేసుకున్నట్లు  తెలుస్తోంది. ఇక కొన్ని కొన్ని సార్లు సినిమా చూస్తున్న సమయంలో ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చూసిన తర్వాత అయ్యో పాపం పవన్ రానాతో నటన విషయంలో ఇబ్బంది లేదు కానీ హైట్ విషయంలో తెగ ఇబ్బంది పడిపోయాడు అని అనుకుంటున్నారట ప్రేక్షకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: